కోహ్లి విజృంభణ: జయసూర్య రికార్డు బ్రేక్!

కొలంబో: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనతను సాధించారు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో క్రికెటర్ గా కోహ్లి గుర్తింపు సాధించారు. శ్రీలంకతో నాల్గో వన్డేలో కోహ్లి తన 29 సెంచరీని నమోదు చేశారు. తద్వారా శ్రీలంక మాజీ దిగ్గజ ఆటగాడు జయసూర్య రికార్డును కోహ్లి సవరించారు. ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్(49) తొలి స్థానంలో ఉండగా, రికీ పాంటింగ్(30)రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా కోహ్లి మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలోనే జయసూర్య(28)ను వెనక్కునెట్టాడు.

లంకేయులతో వన్డేలో కోహ్లి విజృంభించారు. 76 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేసి లంకను ఓ ఆట ఆడేసుకున్నారు. అయిత 96 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 131 పరుగులు చేసిన తరువాత కోహ్లి రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. దాంతో 219 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. శిఖర్ ధావన్ అవుటైన తరువాత రోహిత్ శర్మ కలిసిన కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలుత హాఫ్ సెంచరీని 38 బంతుల్లో పూర్తి చేసుకున్న కోహ్లి.. మరో 38 బంతులు ఎదుర్కొని సెంచరీ మార్కును చేరారు. అయితే మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో కోహ్లిని మలింగా అవుట్ చేశాడు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top