విరాట్‌ కోహ్లీ కి విశ్రాంతి కావాలి

‘గత 48 నెలలుగా విశ్రాంతి లేకుండా క్రికెట్‌ ఆడుతున్నాను. నాకు విశ్రాంతి కావాలి’ అని భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ అన్నాడు. శ్రీలంకతో చివరి టెస్టు అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పుడు నా శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. పని ఒత్తిడి బాగా పడింది. గత 48 నెలల నుంచి నేను విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్నాను. ఇప్పుడు నాకు విశ్రాంతి కావాలి. గత కొన్నేళ్లుగా క్రికెట్‌ ఆడి ఆడి నా శరీరం అలిసిపోయింది. నేను విశ్రాంతి తీసుకోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే త్వరలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు ముందు నాకు విశ్రాంతి అవసరం’ అని కోహ్లీ అన్నాడు.

పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీకి శ్రీలంక మాజీ క్రికెటర్‌ కుమార సంగాక్కర మద్దతు పలికాడు. ‘2017 క్యాలెండర్‌ ఇయర్‌లో కోహ్లీ 2,818 పరుగులు మాత్రమే సాధించాడు. 2014లో సంగాక్కర 2,868 పరుగులు సాధించాడు. కోహ్లీ కంటే సంగాక్కరనే అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు’ అని ఓ అభిమాని ట్విటర్‌లో పేర్కొన్నాడు. ‘కోహ్లీ ప్రస్తుత బ్యాటింగ్‌ ఫామ్‌నే కొనసాగిస్తే ఈ రికార్డు ఎక్కువ కాలం నిలవదని నాకు తెలుసు. కోహ్లీ వచ్చే ఏడాది తప్పనిసరిగా నా రికార్డును అధిగమిస్తాడు. అంతేకాదు ఆ తర్వాతి ఏడాది కూడా దాటేస్తాడు. అతనో డిఫరెంట్‌ క్లాస్‌ ప్లేయర్‌’ అని సంగాక్కర బదులిచ్చాడు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top