ఆనంద్‌కు మరో డ్రా

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): సింక్విఫీల్డ్‌ కప్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఆరో ‘డ్రా’ నమోదు చేశాడు. మాక్సిమి వాచెర్‌ లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌)తో జరిగిన ఎనిమిదో రౌండ్‌ గేమ్‌ను ఆనంద్‌ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఎనిమిదో రౌండ్‌ తర్వాత ఆనంద్‌ 5 పాయింట్లతో మాక్సిమి, అరోనియన్‌ (అర్మేనియా)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో సో వెస్లీ (అమెరికా)తో ఆనంద్‌ ఆడతాడు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top