సెహ్వాగ్ ఆసక్తికరం :గంగూలీ త్యాగం వల్లే ధోని ఈరోజు ఇలా

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గొప్ప ఫినిషర్‌గా ఎదుగానికి కారణం సౌరవ్ గంగూలీయేనని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. గంగూలీ తన బ్యాటింగ్‌ స్థానాన్ని త్యాగం చేయడం వల్లే ధోని ఈ రోజు ఇంతటి గొప్ప ఆటగాడు కాగలిగాడని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.

ఓ టీవీ ఇంటర్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ గంగూలీ తన బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేయకపోతే ధోని ఇంతలా ఎదిగేవాడు కాదని సెహ్వాగ్ వెల్లడించాడు. ప్రస్తుతం ధోని అనుభవిస్తున్న పేరు ప్రఖ్యాతులకు గంగూలీయే కారణమని అన్నాడు. 'అప్పట్లో మేం బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగాలు చేస్తున్నాం. మంచి ఓపెనింగ్‌ లభిస్తే గంగూలీ మూడో స్థానంలో రావాలని లేదంటే ఇర్ఫాన్‌ పఠాన్‌ లేదా ధోని లాంటి హిట్టర్‌ని ఆ స్థానంలో పంపాలని నిర్ణయించాం' అని సెహ్వాగ్ చెప్పాడు.

ధోనిని ప్రమోట్ చేయాలన్నది పూర్తిగా గంగూలీ నిర్ణయమే బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోనిని ప్రమోట్ చేయాలన్నది పూర్తిగా గంగూలీ నిర్ణయమేనని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. ఇలా ఓ యువ ఆటగాడికోసం గంగూలీ తన బ్యాటింగ్‌ స్థానాన్ని మార్చుకోవడం అది రెండోసారి. అంతకుముందు తన కోసం సౌరవ్‌ తన ఓపెనర్‌ స్థానాన్ని త్యాగం చేశాడని సెహ్వాగ్ వెల్లడించాడు.

గంగూలీ నమ్మిన సిద్ధాంతం అదే ఇలాంటి గొప్ప నిర్ణయాలు చాలా తక్కువ మంది కెప్టెన్లు తీసుకుంటారని ప్రశంసించాడు. కొత్త ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్నది గంగూలీ నమ్మిన సిద్ధాంతమని సెహ్వాగ్ చెప్పాడు. 'మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో ధోనీని మూడోస్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని గంగూలీ నిర్ణయించాడు. అతడి లాంటి కెప్టెన్లు చాలా తక్కువ మంది ఉంటారు. ముందుగా తన ఓపెనింగ్ స్థానాన్ని నాకు ఇచ్చాడు' అని సెహ్వాగ్ అన్నాడు.

ఆ తర్వాత తన మూడో స్థానాన్ని ధోనికి 'ఆ తర్వాత తన మూడో స్థానాన్ని ధోనికి ఇచ్చాడు. ఏ కెప్టెన్ ఇంత ధైర్యం చేయరు. ఒకవేళ దాదా అలా చేసి ఉండకపోతే ధోని ఇప్పుడు ఇంత గొప్ప ఆటగాడయ్యేవాడు కాదు. కానీ దాదా చేశాడు. కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతోనే ధోనీని ముందుకు తీసుకొచ్చాడు. అదే ధోని పాలిట వరంగా మారింది. ఇప్పుడు ఇంత గొప్ప ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు' అని సెహ్వాగ్ వివరించాడు.

రాహుల్ ద్రవిడ్ కూడా ధోనిని గంగూలీ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రాహుల్ ద్రవిడ్ కూడా ధోనిని బాగా ప్రోత్సహించాడని చెప్పాడు. ద్రవిడ్ కెప్టెన్సీలో ధోని ఫినిషింగ్ పాత్రకు కచ్చితంగా సరిపోయాడు. రెండుమూడుసార్లు చెత్త షాట్లకు అవుటైతే ఓసారి రాహుల్ ద్రవిడ్ మందలించాడు. ఇక అక్కడి నుంచి ధోని దృక్పథం పూర్తిగా మారిపోయిందని సెహ్వాగ్ తెలిపాడు.

యువీతో కలిసి అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు బంతిని ఎదుర్కొనే తీరు కూడా మార్చేసుకున్నాడని చెప్పాడు. రానురాను సూపర్ ఫినిషర్‌గా మారిపోయాడు. యువీతో కలిసి అతను ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌కు లెక్కేలేదని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఆ తర్వాతి కాలంలో తన బ్యాటింగ్‌‌తో విధ్వంసక విన్యాసాలతో అందరి దృష్టిని ఆకర్షించిన ధోని.. ఆ తర్వాత మిడిల్‌ ఆర్డర్‌ ఆడుతూ గొప్ప ఫినిషర్‌గా పేరు తెచుకున్న సంగతి తెలిసిందే.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top