మ‌ళ్లీ గోపీ గూటికి సైనా

హైద‌రాబాద్‌: స‌్టార్ షట్ల‌ర్ సైనా నెహ్వాల్ మ‌ళ్లీ త‌న సొంత గూటికి తిరిగొచ్చింది. స‌రిగ్గా మూడేళ్ల కింద‌ట గోపీచంద్‌ను కాద‌ని బెంగ‌ళూరు కోచ్‌ విమ‌ల్ కుమార్‌తో జ‌త క‌ట్టిన సైనా ఇప్పుడు మ‌ళ్లీ గోపీ అకాడ‌మీలో ప్రాక్టీస్ మొద‌లుపెట్టింది. గ‌త వారం వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్స్‌లో గోపీతో మాట్లాడుతూ క‌నిపించింది సైనా. ఆ టోర్నీ ముగిసిన వెంట‌నే సైనా హైద‌రాబాద్ తిరిగొచ్చేసింది. 2014, సెప్టెంబ‌ర్ 2న సైనా గోపీ అకాడ‌మీకి గుడ్‌బై చెప్పి బెంగ‌ళూరు వెళ్లిపోయింది. విమ‌ల్ కోచింగ్‌లోనూ సైనా మంచి విజయాలే సాధించింది. వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్ కావ‌డంతోపాటు వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్స్‌లో రెండు మెడ‌ల్స్‌, ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ఫైన‌ల్ చేరింది.

ఈ మూడేళ్ల‌లో సైనా గోపీచంద్‌కు దూరంగానే ఉన్న‌ది. అయినా ఇద్ద‌రి మ‌ధ్య సంబంధాలు పూర్తిగా ఏమీ చెడిపోలేదు. నిజానికి గోపీ కోచింగ్‌లోనే సైనా ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు సాధించింది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న‌ల్ దేశంలో బ్యాడ్మింట‌న్‌కు మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది. ఒలింపిక్స్‌లో బ్రాంజ్ గెలిచిన తొలి ష‌ట్ల‌ర్‌గా సైనా నిలిచింది. ఇప్పుడీ ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌ల‌వ‌డంతో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని అభిమానుల‌కు కోరుకుంటున్నారు. 2010లోనూ కామ‌న్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడ‌ల్ గెలిచిన త‌ర్వాత సైనా గోపీచంద్‌ను కాద‌ని భాస్క‌ర్ బాబు ద‌గ్గ‌రికి కోచింగ్‌కు వెళ్లినా.. కొన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ గోపీ అకాడ‌మీకే తిరిగొచ్చింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top