డ్రా గా ముగిసిన మ్యాచ్

భారత్‌-శ్రీలంక టెస్టు సిరీస్‌కు అనూహ్యమైన ముగింపు. గెలుపు ఖాయమ నుకున్న కోహ్లీసేనను విజయం వెక్కిరిస్తే.. ఓటమి ముంగిట నిలిచిన శ్రీలంక అద్భుతం గా పోరాడి డ్రాతో గట్టెక్కింది. ధనంజయ డిసిల్వ (219 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్‌తో 119), రోషన్‌ సిల్వ (154 బంతుల్లో 11 ఫోర్లతో 74 నాటౌట్‌) రాణించడంతో మూడో, ఆఖరి టెస్టును లంక డ్రాగా ముగించింది. 410 పరుగుల లక్ష్యంతో బుధవారం ఛేదన కొనసాగించిన పర్యాటక జట్టు 103 ఓవర్ల పాటు పోరాడి ఆట చివరకు 299/5 స్కోరుతో నిలిచి ఓటమి తప్పించుకుంది. డిసిల్వ, రోషన్‌తో పాటు డిక్‌వెలా (44 నాటౌట్‌), కెప్టెన్‌ చాందిమల్‌ (36) భారత బౌలర్లకు ఎదురొడ్డి నిలిచారు. ఐదోరోజు భారత బౌలర్లు రెండు వికెట్లు మాత్రమే తీయగలిగారు. కాగా, కెప్టెన్‌ కోహ్లీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’లు గెలుచుకున్నాడు. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ 10న ధర్మశాలలో మొదలవుతుంది.

కుర్రాళ్ల పోరాటం.. బౌలర్ల వైఫల్యం

ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి తప్పించుకుందంటే అది ధనంజయ డిసిల్వ అద్భుత శతక ఫలితమే. అతనికి అరంగేట్రం ప్లేయర్‌ రోషన్‌ సిల్వ అందించిన సహకారం.. ఆఖరి సెషన్‌లో డిక్‌వెలా పోరాటాన్ని కూడా తక్కువ చేయలేం. వాస్తవానికి ఆఖరి రోజును భారత్‌ సానుకూలంగానే ఆరంభించింది. ప్రమాద కర మాథ్యూస్‌ (1)ను ఆరో ఓవర్లోనే జడేజా పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో ఆదిలోనే 35/4తో నిలవడంతో లంక ఓటమికి ఎంతో సమయం పట్టదనిపించింది. కానీ, కెప్టెన్‌ చాందిమల్‌తో కలిసి డిసిల్వ పోరాడాడు. ఈ క్రమంలో 98 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో నిలదొక్కుకున్న చాందిమల్‌ను లంచ్‌కు నాలుగు ఓవర్ల ముందు జడేజా క్లీన్‌ బౌల్డ్‌ చేసినా.. అది నోబాల్‌ కావడంతో లంక సారథి బతికిపో యాడు. అయితే, రెండో సెషన్‌ ఆరంభంలోనే చాందిమల్‌ను అవుట్‌ చేసిన అశ్విన్‌ 105 పరుగుల ఐదో వికెట్‌ భాగస్వామ్యా నికి తెరదించాడు. ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. డిసిల్వ కు రోషన్‌ తోడవడంతో పరిస్థితి తారుమారైంది. సమయం గడుస్తున్నకొద్దీ భారత బౌలింగ్‌ తీసికట్టుగా మారింది. ముఖ్యం గా అశ్విన్‌ తీవ్రంగా నిరాశ పరిచాడు. అయితే జడేజా మాత్రం షార్ప్‌ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పరీక్షించాడు. కానీ.. డిసిల్వ క్రీజు లోపలే ఉంటూ రవీంద్రను సులభంగా ఎదుర్కొన్నాడు. కొత్త కుర్రాడు రోషన్‌ కూడా ధనంజయతో పోటీ పడి షాట్లు ఆడాడు. 188 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న డిసిల్వ కాసేపటికే కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. లంక 226/5తో పటిష్ఠ స్థితిలో టీ బ్రేక్‌కు వెళ్లగా.. చివరి సెషన్‌లో భారత బౌలర్ల నుంచి అభిమానులు అద్భు తాన్ని ఆశిం చారు. రెండో కొత్త బంతిని అందుకున్న పేసర్లు షమి, ఇషాంత్‌ వికెట్‌ తీయలేక పోయారు. ఆ తర్వాత బంతి మళ్లీ స్పిన్నర్ల చేతికి వచ్చినా ఫలితం లేకపోయింది. రోషన్‌తో పాటు డిక్‌వెలా వారిని సమర్థంగా ఎదుర్కొన్నారు. ఆఖర్లో జడేజా ఓవర్లో డిక్‌వెలా క్రీజు వదిలి వచ్చినా.. సాహా స్టంపౌట్‌ చేయలేక పోయాడు. చివరి సెషన్‌లో భారత్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేక డ్రాతో సరిపెట్టుకుంది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 536/7డిక్లేర్డ్‌;

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: 373;

భారత్‌ రెండోఇన్నింగ్స్‌: 246/5డిక్లేర్డ్‌;

శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ (లక్ష్యం 410): కరుణరత్నె (సి) సాహా (బి) జడేజా 13, సమరవిక్రమ (సి) రహానె (బి) షమి 5, డిసిల్వ (రిటైర్డ్‌ హర్ట్‌) 119, లక్మల్‌ (బి) జడేజా 0, మాథ్యూస్‌ (సి) రహానె (బి) జడేజా 1, చాందిమల్‌ (బి) అశ్విన్‌ 36, రోషన్‌ (నాటౌట్‌) 74, డిక్‌వెలా (నాటౌట్‌) 44; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 103 ఓవర్లలో 299/5; వికెట్ల పతనం: 1-14, 2-31, 3-31, 4-35, 5-147; బౌలింగ్‌: ఇషాంత్‌ 13-2-32-0, షమి 15-6-50-1, అశ్విన్‌ 35-3-126-1, జడేజా 38-13-81-3, విజయ్‌ 1-0-3-0, కోహ్లీ 1-0-1-0.

9 నాటౌట్‌

ఆస్ర్టేలియా తర్వాత వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌లు గెలిచిన జట్టుగా భారత్‌ రికార్డు సాధించింది. 2015 ఆగస్టులో శ్రీలంకపైనే సిరీస్‌ గెలిచి జైత్రయాత్రను మొదలుపెట్టిన భారత్‌ ఇప్పుడు అదే జట్టుపై రికార్డును పట్టేయడం విశేషం. ఆసీస్‌ 2005 అక్టోబర్‌ - 2008 జూన్‌ మధ్యలో వరుసగా 9 సిరీస్‌లు గెలిచింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top