భారత ఓపెనర్లు సరికొత్త రికార్డు

పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో భారత ఓపెనింగ్ జంట కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్లు సరికొత్త రికార్డునెలకొల్పారు. మూడో టెస్టు జరుగుతున్న పల్లెకెలె ఇంటర్నేషన్ స్టేడియంలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం రికార్డు సాధించారు. భారత స్కోరు 84 పరుగుల వద్ద ఉండగా ఇక్కడ అత్యధిక ఓపెనింగ్ పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన జోడీగా రాహుల్-ధావన్లు నిలిచారు. అదే సమయంలో గత నాలుగేళ్లలో శ్రీలంకతో వంద అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన రెండో ఓపెనింగ్ జోడిగా కూడా ధావన్-రాహుల్ గుర్తింపు పొందారు. వీరికి ముందు బంగ్లాదేశ్ ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్-సౌమ్య సర్కార్ లు ఉన్నారు. ఈ జోడి గడిచిన నాలుగేళ్లలో లంకలో 118 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

ప్రస్తుతం జరుగుతున్న చివరి టెస్టులో ధావన్-రాహుల్ లు హాఫ్ సెంచరీలు చేశారు. తొలుత 45 బంతుల్లో ధావన్ హాఫ్ సెంచరీ సాధించగా,ఆపై 67 బంతుల్లో రాహుల్ అర్థ శతకం సాధించాడు. వీరిద్దరూ కుదురుగా ఆడటంతో భారత జట్టు 24.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 118 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top