మైదానంలోనే అతగాడికి ముద్ద?

మైదానంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను పదునైన బంతులతో దడ పుట్టించే దక్షిణాఫ్రికా స్టార్‌ బౌలర్‌ కాగిసో రబాడ తన గర్లఫ్రెండ్‌ ఏమంటుందో అని భయపడుతున్నాడు. అంతేకాదు మైదానంలో సహచర ఆటగాళ్లతో ఆ ముద్దులేంటని ప్రశ్నించిందట. ఈ విషయాన్ని రబాడనే చెప్పాడు. అసలు ఈ ముద్దుల గోల ఏంటనేగా మీ అనుమానం.

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య కేప్‌టౌన్‌లో తొలి టెస్టు జరిగిన విషయం తెలిసిందే కదా. ఈ టెస్టులో భారత్‌ కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చాడు హార్దిక్‌ పాండ్య. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఎవరూ ఊహించని విధంగా స్కోరు బోర్డును కదిలించాడు. ఈ క్రమంలో 70వ ఓవర్‌ వేసేందుకు బంతిని అందుకున్నాడు రబాడ. తొలి బంతికే పాండ్య(93) డీకాక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఒంటరి పోరాటం చేస్తున్న పాండ్య వికెట్‌ తీయడంతో దక్షిణాఫ్రికా సారథి డూప్లిసిస్‌.. రబాడ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి పట్టరాని సంతోషంతో అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఈ టెస్టులో రబాడ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రబాడ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

ఈ సందర్భంగా డూప్లిసిస్‌.. తాను రబాడను ముద్దు పెట్టుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకుని నంబర్‌వన్‌ స్థానం దక్కించుకున్నందుకు అభినందనలు తెలిపాడు. దీనికి రబాడ ‘ఈ ఫొటో చూసి నా గర్ల్‌ఫ్రెండ్‌ ప్రశ్నించింది’ అని సరదాగా కామెంట్‌ పెట్టాడు. ప్రస్తుతం డూప్లిసిస్‌-రబాడకు సంబంధించిన ఈ ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top