ఇర్ఫాన్‌కు కాంస్య పతకం

న్యూఢిల్లీ: ఆసియా రేస్‌ వాక్‌ చాంపియన్‌షిప్‌లో భారత వాకర్‌ కె.టి.ఇర్ఫాన్‌ కాంస్య పతకాన్ని సాధించాడు. ఆదివారం జపాన్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో ఇర్ఫాన్‌ పురుషుల 20 కిలోమీటర్ల నడక విభాగంలో మూడో స్థానాన్ని సంపాదించాడు. కేరళకు చెందిన ఇర్ఫాన్‌ గంటా 20 నిమిషాల 59 సెకన్లలో గమ్యానికి చేరుకున్నాడు.

కిమ్‌ హున్‌ సబ్‌ (కొరియా–1గం: 19ని: 50 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... జార్జీ షీకో (కజకిస్తాన్‌–1గం: 20ని: 47 సెకన్లు) రజత పతకాన్ని దక్కించుకున్నాడు. మహిళల 20 కిలోమీటర్ల విభాగంలో భారత్‌కు చెందిన ప్రియాంక గంటా 37 నిమిషాల 42 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top