టీమిండియా స్పిన్నర్‌ రవీంద్ర జడేజా పొరపాటు వల్ల భారత్‌ ఐదో వికెట్‌

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక దీటుగానే ఆడుతోంది. ఐదో రోజు, బుధవారం ఓవర్‌నైట్‌ స్కోరు 31/3తో బ్యాటింగ్‌ ఆరంభించిన ఆ జట్టు లంచ్‌ సమయానికి 119/4తో నిలిచింది. నైట్‌ వాచ్‌మన్‌ ధనంజయ డిసిల్వా (72; 128 బంతుల్లో 9×4, 1×6) అద్భుత అర్ధశతకం బాదేశాడు. తొలుత భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఇబ్బంది పడిన అతడు తర్వాత పుంజుకున్నాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత చక్కని బౌండరీలు బాదాడు. అతనికి తోడుగా సారథి దినేశ్‌ చండిమాల్‌ (27; 71 బంతుల్లో 2×4) నిలకడగా ఆడుతున్నాడు. అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలిస్తున్నాడు.

జడేజా నోబాల్స్‌

టీమిండియా స్పిన్నర్‌ రవీంద్ర జడేజా పొరపాటు వల్ల భారత్‌ ఐదో వికెట్‌ పడగొట్టలేకపోయింది. అతడు వేసిన 43.4వ బంతికి దినేశ్‌ చండిమాల్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఐతే లంక కోరిన సమీక్షలో జడేజా బంతిని క్రీజుదాటి విసిరినట్టు కనిపించడంతో బతికిపోయాడు. అంతకు ముందు జట్టు స్కోరు 35 వద్ద మాథ్యూస్‌ (1) రహానెకు క్యాచ్‌ ఇచ్చాడు. ఇదీ నోబాలే. ఐతే అంపైర్‌ గమనించకపోవడంతో మాథ్యూస్‌ పెవిలియన్‌ చేరుకున్నాడు. మిగతా రెండు సెషన్లలో టీమిండియా 59 ఓవర్లు విసరాలి. కాలుష్యం, వెలుతురు లేమితో మ్యాచ్‌ను ముందే నిలిపివేస్తున్నారు. ఇలాంటి తరుణంలో భారత్‌ ఎంత త్వరగా ఆరు వికెట్లు పడగొడుతుందన్నది ఆసక్తికరం.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top