రవి శాస్త్రిని రాక్ స్టార్ అంటున్న హార్దిక్ పాండ్య

కోచ్‌ రవిశాస్త్రి రాక్‌స్టార్‌ అని టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నారు. ఆయన చాలా ప్రశాంతంగా ఉంటారన్నారు. తనకు స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం ఇచ్చిన ఆయనతో ఎప్పుడూ సన్నిహితంగా ఉంటానని పేర్కొన్నారు. అద్భుతమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో జట్టుకు కీలకంగా మారిన పాండ్య తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.

ఈ ఏడాదిలో తాను 30 వన్డేలు, 25 టీ20లు, 3 టెస్టులు ఆడానన్నారు. ఇంకా తక్కువ క్రికెట్‌ ఆడినట్టు అనిపిస్తే వారికి క్షమాపణలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. శారీరకంగా అలసిపోయినట్టు అనిపించడంతో విశ్రాంతి కోరినట్టు చెప్పారు. విరాట్‌, ధోనీ నుంచి చాలా నేర్చుకున్నట్టు వెల్లడించారు. ధోనీ నుంచి సలహాలు స్వీకరిస్తానన్నారు.

‘ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఆడటమే నా కెరీర్‌లో కీలక మలుపు. దాంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. నాకన్నీ ఇచ్చిన జట్టును ఎందుకు వీడిపోతాను?. మూడేళ్ల క్రితం పాండ్యకు ఇప్పటి పాండ్యకు ఎంతో తేడా ఉంది. సచిన్‌ ప్రశంసలు ప్రేరణనిచ్చాయి. అక్షయ్‌ కుమార్‌కు నేను పెద్ద అభిమానిని. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ నా అభిమాని అని తెలియడంతో ఎంతో ఆనందం కలిగింది.’ అని పాండ్య వివరించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top