హ్యాపీ బర్త్‌డే సచిన్‌ సర్

క్రికెట్‌ దేవుడు సచిన్‌ తెందుల్కర్‌ జన్మదినం ఈ రోజు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పెద్ద సంఖ్యలో సంపాదించుకున్న సచిన్‌ ఈ రోజు 45వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద సంఖ్యలో సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ‘హ్యాపీ బర్త్‌డే సచిన్‌ తెందుల్కర్‌’ హ్యాష్‌ ట్యాగ్‌ టాప్‌ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

1973 ఏప్రిల్‌ 24న ముంబయిలో జన్మించిన సచిన్‌ 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 1989 నవంబరు 15న పాకిస్థాన్‌తో టెస్టు క్రికెట్‌లోకి, అదే ఏడాది డిసెంబరు 18న ‌అదే జట్టుపై సచిన్‌ వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అనతి కాలంలోనే సచిన్‌ క్రికెట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయాడు. ‘సచిన్‌ అంటే క్రికెట్‌.. క్రికెట్‌ అంటే సచిన్‌’ అన్న రీతిలో ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని పేరును సంపాదించుకున్నాడు. క్రికెట్‌లో లెక్కపెట్టలేనన్ని రికార్డులు, మరెన్నో ఘనతలు సాధించిన సచిన్‌ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో శత శతకాలు(టెస్టుల్లో-51, వన్డేల్లో- 49) సాధించిన ఏకైక క్రికెటర్‌ సచిన్‌.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top