షరపోవాపై మే 15న స్పష్టత

పారిస్‌: గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రష్యా టెన్నిస్‌ తార మరియా షరపోవాకు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ లభిస్తుందా లేదా అనే అంశంపై మే 15న స్పష్టత రానుంది. ఈ విషయాన్ని ఫ్రెంచ్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఎఫ్‌టీఎఫ్‌) గురువారం ప్రకటించింది. ‘రోలండ్‌ గారోస్‌ టోర్నీ క్వాలిఫయర్స్‌కు వారం రోజుల ముందు మే15న షరపోవా విషయంలో మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం. ఒకవేళ మేం వైల్డ్‌కార్డ్‌ అనుమతి ఇవ్వకపోయినా క్వాలిఫయర్స్‌ ఆడి ఆమె ఈ టోర్నీలో పాల్గొనవచ్చు’ అని ఎఫ్‌టీఎఫ్‌ అధ్యక్షుడు బెర్నార్డ్‌ గుడిసెలి అన్నారు.

మే 28 నుంచి జూన్‌ 11 వరకు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ జరగనుంది. మరోవైపు సెరెనా విలియమ్స్‌ కూడా ప్రెగ్నెన్సీ కారణంగా ఈ సీజన్‌ టోర్నీల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడంతో షరపోవాకు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ దొరుకుతుందని అభిమానులు ఆశించారు. అయితే సెరెనా, షరపోవాలిద్దరివి విభిన్నమైన కేసులు. ఒకరి గైర్హాజరీతో మరొకరికి సంబంధం లేదని బెర్నార్డ్‌ స్పష్టం చేశారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top