అవుట్ ఎలా అయ్యాడు

ఇప్పటివరకూ క్రికెట్ లో చాలా రకాలు అవుట్ లను చూసుంటాం. అందులో క్యాచ్, ఎల్బీ, బౌల్డ్, రనౌట్ ఇలా కొన్ని మనకు బాగా సుపరిచితమే. కాగా, రిటైర్డ్ అవుట్, అబ్ స్ట్రక్టింగ్ ద ఫీల్డ్, హిట్ ద బాల్ ట్వైస్ వంటి అవుట్లు క్రికెట్ లో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ బంతి బ్యాట్‌ను తాకలేదు, అలా అని కాళ్లపైకి రాలేదు, స్టంప్స్‌కు తాకలేదు..ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అప్పీల్‌ చేయలేదు. కానీ, అంపైర్‌ బ్యాట్స్‌మెన్‌ ఔట్‌ అయినట్లు ప్రకటించాడు. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసి అభిమానులకు సరికొత్త పరీక్ష పెట్టాడు. దీన్ని చూసిన నెటిజన్లు ఆ వీడియో ఎప్పటిది అనే దానిపై కొంతవరకూ సక్సెస్ అయినా, అసలు అవుట్ ఎలా అయ్యాడు అనే దానిపై మాత్రం తలలు పట్టుకుంటున్నారు.

ఇది 2007 మ్యాచ్‌ 15న ఓవల్‌లో సర్రే లీడ్స్ - బ్రాడ్‌ఫోర్డ్‌ యూసీసీఈ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న సన్నివేశంగా కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు. బ్యాట్స్‌మెన్‌ టామ్‌ మెరిలాట్‌ అని, బౌలర్‌ మహమ్మద్‌ అక్రమ్‌ అని, అంపైర్‌ ఇయాన్‌ గౌల్డ్‌గా మరికొంతమంది చెప్పారు. కాకపోతే బ్యాట్స్ మన్ ఎలా అవుటయ్యాడు అనే దానిపై స్పష్టత లేదు. మరొకవైపు యువీ కూడా బ్యాట్స్ మన్ ఎవరు, మ్యాచ్ ఎప్పటిది, ఎలా అవుటయ్యాడు అనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ అవుట్ అనేది అభిమానులకు ఒక పజిల్ గా మారిపోయింది. దీనిపై యువీ స్పష్టత ఇస్తే కానీ బ్యాట్స్ మన్ ఎలా పెవిలియన్ చేరింది తెలుస్తుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top