తనపై వేసిన విమర్శలు తీపికోటినా ధోని

తనపై మాజీ క్రికెటర్లు చేస్తున్న విమర్శలను టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ తిప్పికొట్టారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ సొంత ఆలోచనలు ఉంటాయని పేర్కొన్నారు. మహీ టీ20 భవిష్యత్తు గురించి మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ విమర్శలు చేశాడు. టీ20లను ధోనీ కుర్రాళ్లకు వదిలేయాలని, లేదంటే ఆడే విధానం మార్చుకోవాలని వీవీఎస్‌ లక్ష్మణ్‌ సూచించిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో సొంత క్రికెట్‌ అకాడమీ ప్రారంభించిన సందర్భంగా ధోనీ విమర్శకులకు సమాధానం చెప్పారు.

గౌరవించాలి

జీవి‘తంలో ప్రతి ఒక్కరికీ సొంత అభిప్రాయాలు ఉంటాయి. వాటిని అందరూ గౌరవించాలి’ అని అగార్కర్‌ వ్యాఖ్యలపై ధోనీ స్పందించారు. వన్డే, టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టుకు సారథిగా ఉన్న ధోనీ ఈ మధ్య కాలంలో అనకున్నంత వేగంగా బ్యాటింగ్‌ చేయడం లేదు.అప్పట్లో వెస్టిండీస్‌పై తాజాగా న్యూజిలాండ్‌ టీ20లో బ్యాటింగ్‌లో తడబడ్డాడు. విమర్శలు ఎన్ని వచ్చినా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతున్నారు.

ప్రక్రియనే నమ్ముతా

‘భారత క్రికెట్‌ జట్టులో భాగమవ్వడమే అతి పెద్ద ప్రేరణ. కష్టపడి జట్టులోకి వచ్చిన క్రికెటర్లను మనం చూశాం. అభిరుచి వల్లే ఇది సాధ్యమవుతుంది. శిక్షకులు సైతం దీన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ దేశం తరఫున ఆడలేరు. నేనెప్పుడూ ఫలితం కన్నా ప్రక్రియనే నమ్ముతా. ఫలితాల గురించి ఆలోచించను. చేయాల్సింది ఐదు పరుగులా, పది పరుగులా, 15 పరుగులా అని కాకుండా ఏం చేస్తే బాగుంటుందో అదే చేస్తా. ఫలితం నాకు అనుకూలంగా రాకపోతే ఏం జరుగుతుందో అనే ఒత్తిడికి గురవ్వను’ అని ధోనీ అన్నాడు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top