ధోనీ మరోసారి సారథి బాధ్యతలు నిర్వహించనున్నాడు

భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన హీరో మహేంద్ర సింగ్‌ ధోనీ మరోసారి సారథి బాధ్యతలు నిర్వహించనున్నాడు. టీమిండియాకు కాదండోయ్‌. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కి. ఔను. ఈ విషయాన్ని ఆ జట్టు డైరెక్టర్‌ జార్జ్‌ జాన్‌ వెల్లడించారు.

ఐపీఎల్‌ పాలక మండలి బుధవారం దిల్లీలో సమావేశమై వచ్చే ఏడాది లీగ్‌పై కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపి వెల్లడించిన సంగతి తెలిసిందే. స్పాట్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ ఆరోపణలు ఎదుర్కొన్న చెన్నై, రాజస్థాన్‌ తమ రెండేళ్ల నిషేధాన్ని పూర్తి చేసుకోవడంతో వచ్చే ఏడాది లీగ్‌లోకి అడుగుపెట్టేందుకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు డైరెక్టర్‌ జార్జ్‌ జాన్‌ మాట్లాడుతూ.. ‘చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలో అర్ధం కావడంలేదు. ఇక మా జట్టును ముందుండి నడిపించేది ధోనీనే. అతడే మా కెప్టెన్‌’ అని తెలిపాడు. అంతకుముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని శ్రీనివాసన్‌ కూడా తిరిగి మా జట్టుకు ధోనీనే కెప్టెన్‌ అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ధోనీ శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లకు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 10 నుంచి భారత్‌-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ రెండు సిరీస్‌లకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top