శ్రీలంక ఆటగాడు ధనంజయ డిసిల్వా శతకం బాదేశాడు

కోహ్లీసేనతో జరుగుతున్న చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆటగాడు ధనంజయ డిసిల్వా (110; 194 బంతుల్లో 14×4, 1×6) శతకం బాదేశాడు. తొలుత ఆచితూచి ఆడిన అతడు సారథి దినేశ్‌ చండిమాల్‌ ఉన్నప్పుడు చెలరేగాడు. వరుస బౌండరీలు బాదేశాడు. 90ల్లో నెమ్మదించి మహ్మద్‌ షమి వేసిన 65.4వ బంతికి 3 పరుగులు తీసి టెస్టుల్లో మూడో శతకం నమోదు చేశాడు.

భారత విజయాన్ని అతడు మరింత ఆలస్యం చేస్తున్నాడు. ఇంకో ఐదు వికెట్లు తీస్తే కోహ్లీసేన సిరీస్‌ గెలుస్తుంది. రోషన్‌ సిల్వా (11; 41 బంతుల్లో 2×4) నిలకడగా ఆడుతున్నాడు. 68 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 178/5తో ఉంది. ఆ జట్టు విజయానికి 232 పరుగులు అవసరం.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top