బుమ్రా ఆ టెస్టులో చేసిన తప్పులను సరిచేసుకుంటాడా?

దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌ టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు భారత ఆటగాడు బుమ్రా. తొలి టెస్టులో మిస్టర్‌ 360, ఏబీ డివిలియర్స్‌ వికెట్‌ దక్కడం చాలా ఆనందంగా ఉందని, కేప్‌టౌన్‌ టెస్టు పరాజయం వల్ల మా ఆత్మవిశ్వాసం ఏమాత్రం దెబ్బతినలేదని, ఆ టెస్టులో చేసిన తప్పులను సవరించుకుని రెండో టెస్టు బరిలోకి దిగుతామని బుమ్రా తెలిపారు.

తాజాగా బుమ్రా మీడియాతో మాట్లాడుతూ..‘కేప్‌టౌన్‌ టెస్టు నుంచి చాలా నేర్చుకున్నాను. బౌలర్‌గా నేను వీలైనంత త్వరగా వికెట్‌ తీయాలని అనుకుంటాను. నేను అనుకున్నట్లు త్వరగానే ఏబీ డివిలియర్స్‌ వికెట్‌ దక్కింది. ఇది నాకు చాలా సంతోషకరమైన సందర్భం. మ్యాచ్‌ గెలిస్తే ఆనందంగా.. ఓడిపోతే నిరాశగా ఉండటం నా పద్ధతి కాదు. గత మ్యాచ్‌లో ఏం జరిగినా దాన్ని పట్టించుకోకుండా రెట్టింపు ఉత్సహంతో తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవ్వడమే. ఒక మ్యాచ్‌ అనంతరం మాలో ఏమాత్రం ఆత్మవిశ్వాసం తగ్గదు. అదే జరిగితే తదుపరి మ్యాచ్‌ సరిగా ఆడలేం. నా వరకు కేప్‌టౌన్‌ టెస్టు మంచి అనుభవం. ఎందుకంటే నేను దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఆడలేదు. కేప్‌టౌన్‌లో ఆడటమే తొలిసారి. ఈ టెస్టు నుంచి చాలా నేర్చకున్నాను. ఇప్పుడు మా దృష్టి అంతా రెండో టెస్టుపైనే’ అని బుమ్రా తెలిపాడు.

మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య శనివారం నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది. కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టులో భారత్‌ 72 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top