ముంబయి ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆ జట్టు ఆటగాడు కమిన్స్‌ మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ కోసం నిర్వహించిన వేలంలో కమిన్స్‌ను ముంబయి ఇండియన్స్‌ రూ.5.4కోట్లకు దక్కించుకుంది.

ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఇప్పటికే గాయం కారణంగా మిచెల్‌ స్టార్క్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పుడు మరో ఆటగాడు పాట్‌ కమిన్స్‌ కూడా గాయం కారణంగానే ఈ టోర్నీ ఆడలేకపోతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టెస్టులో కమిన్స్‌కు గాయమైంది. స్కానింగ్‌ నిర్వహిస్తే గాయం తీవ్రమైందని తెలింది. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కొద్ది వారాల తర్వాత మరోసారి స్కానింగ్‌ నిర్వహిస్తాం. ఈ కారణంగానే అతడు ఐపీఎల్‌కు దూరం కావాల్సి వచ్చింది’ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారి డేవిడ్‌ బీక్లి తెలిపారు.

తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ చేతిలో ఓడిపోయిన ముంబయి ఇండియన్స్‌ తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. హైదరాబాద్‌లో ఈ నెల 15న ఈ మ్యాచ్‌ జరగనుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top