భారత్ ఓటమితో బంగ్లావాసి ఆత్మహత్య

ఢాకా: చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జరిగిన టైటిల్ పోరులో భారత్ ఓడిపోవడం సగటు భారత అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే భారత్ క్రికెట్ జట్టు ఓటమి బంగ్లాదేశ్ కు చెందిన ఒక వీరాభిమానిని ఆత్మహత్యకు ప్రేరిపించింది. ఆదివారం జరిగిన తుది పోరులో విరాట్ సేన ఓటమి పాలైన అనంతరం బంగ్లాదేశ్ కు చెందిన బిద్యుత్(25) అనే అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. భారత జట్టు ఓడిపోయిన కొద్ది సేపటికి వేగంగా వెళుతున్న రైలుకు ఎదురుగా వెళ్లి బలవన్మరణానికి పాల్పడినట్లు ఢాకా పోలీస్ అధికారి నాసిరుల్ ఇస్లామ్ తెలిపారు. షాంగ్ గేట్ ప్రాంతంలో ఒక చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే అతను భారత క్రికెట్ జట్టుకు వీరాభిమానిగా పేర్కొన్నారు.

ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి టైటిల్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top