నెట్‌కెక్కిన పాస్టర్ల బాగోతం

విజయవాడలో ఇద్దరు పాస్టర్ల మధ్య బాగోతం నెట్‌కెక్కి సంచలనం సృష్టిస్తోంది. అక్కడి క్రిస్టియన్ సంఘాల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. జీసస్ మిరాకిల్స్ పేరిట చర్చ్ నిర్వహిస్తూ, అనేక చోట్ల ‘పరిశుద్ధ’ జల అమ్మకాలంటూ నీళ్ళు విక్రయిస్తున్న పాస్టర్ ప్రదీప్ కుమార్ రాసలీలలను మరో బ్రదర్ అరవింద్ సాయి బయటపెట్టాడు. అమ్మాయిలతో బ్రదర్ ప్రదీప్ సన్నిహితంగా ఉన్న వీడియోలు, హోటల్ గదిలో మద్యం తాగుతున్న దృశ్యాలతో ఉన్న ఈ వీడియోలు సెన్సేషన్ అయ్యాయి. జీసస్ మిరాకిల్స్ పేరిట ప్రదీప్ అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడంటూ ఓ షార్ట్ ఫిల్మ్ కూడా యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ప్రదీప్‌కు, ‘ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్’ సంస్థ చీఫ్.. బ్రదర్ విజయ ప్రసాద్‌కు మధ్య విభేదాలున్నాయని, అందువల్లే ఈ వీడియోలు బయటకు వచ్చాయని అంటున్నారు. కాగా.. తన ప్రతిష్టను దిగజార్చారంటూ ప్రదీప్ విజయవాడ సింగ్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. అరవింద్ సాయితోబాటు మరో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే తమ కొడుకును అన్యాయంగా అరెస్టు చేశారని సాయి తండ్రి లక్ష్మణరావు వాపోతున్నారు.



అవన్నీ గతంలో నేను చేసిన తప్పులే :

ఇదిలా ఉండగా.. తానిప్పుడు మారిపోయానని, గతంలో తను చేసిన తప్పులకు చింతిస్తున్నానని అంటున్నాడు ప్రదీప్ కుమార్. క్రైస్తవ సమాజంలో తనకు వస్తున్న మంచి పేరును పాడు చేసేందుకు కొన్ని సంఘాలు పని గట్టుకుని ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నాయని అన్నాడు. ‘నేను మారిన విషయాన్ని ప్రజలకు చూపించి వారిని సన్మార్గంలో పెట్టాలన్న ఉద్దేశంతోనే నేనే స్వయంగా ఆ వీడియోలు తీయించా’ అని కూడా ప్రదీప్ పేర్కొన్నాడు. వాటిని తన వద్ద పని చేసినవారే రహస్యంగా దొంగిలించి ఇలా మీడియాలో పెట్టారన్నాడు. ఇటీవలి కాలంలో తనతో ఫోటోలు దిగిన యువతులు అక్కాచెల్లెళ్ళ వంటివారని, వాళ్ళంతా చర్చికి వచ్చే సభ్యులేనని ప్రదీప్ కుమార్ తెలిపాడు.


Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top