అందాలతో మురిపిస్తూ యువ డాక్టర్ ల బ్లాక్ మెయిల్

‘నమస్కారం డాక్టర్‌ గారు! నా పేరు మాయ(పేరు మార్చాం)! కడుపు నొప్పిగా ఉంది. మీరు బాగా చూస్తారని చెబితే వచ్చాను’’... అంటూ ఓ అందమైన యువతి కుర్చీని డాక్టర్‌కు బాగా దగ్గరగా లాగి కూర్చుంది. ‘‘ఇక్కడ బాగా నొప్పిగా ఉందండి... చూడండి’’ అంటూ డాక్టర్‌ ఏమీ అడగకముందే చీరను మరింత కిందికి లాగింది. అదోరకం చూపు కూడా విసిరిం ది. అంతే... ఆ కుర్ర డాక్టర్‌ గుండె లయ తప్పింది. అయినా... వైద్యుడిగా తన విద్యుక్త ధర్మం గుర్తుకొచ్చి నిగ్రహించుకున్నాడు. ఆ యువతి ‘అవాంఛనీయమైన’ చొరవ చూపడంపట్ల లోలోపల ఆశ్చర్యపోతూనే.. చికిత్సకు ఉపక్రమించాడు. ఆ తర్వాత ఆమె తన ‘రోగానికి’ సంబంధం లేని కబుర్లు మొదలుపెట్టింది. ‘‘నాకు పెళ్లై రెండేళ్లయ్యిందండీ. మా వారు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కొద్దికాలం తర్వాత అక్కడకు తీసుకువెడతానంటున్నాడు. ప్రస్తుతం అపార్టుమెంటులో ఒంటరిగా ఉంటున్నాను.

రాత్రిళ్

లు అసలు నిద్ర పట్టడం లేదు’’ అంటూ హొయలు పోయింది. ఆ తర్వాత... ‘‘నాకు పిల్లలంటే బాగా ఇష్టం. మా వారికి సంసారం ఇంటే పెద్దగా ఆసక్తి ఉండదు. నాకు ఏం చేయాలో తెలీడం లేదు’’ అంటూ ఉన్నట్టుండి ఏడుపు మొదలుపెట్టింది. దీంతో డాక్టర్‌ ఆమె భుజంపై చేయి వేసి ఓదార్చాడు. వెంటనే ఆయన భుజంపై తల పెట్టి ఏడ్వవసాగింది. కొద్దిసేపటికి ఆమె తేరుకొని ‘‘సారీ డాక్టర్‌ గారు... నా కష్టాలు చెప్పి మిమ్మల్ని ఇబ్బందిపెట్టాను’’ అంటూ కన్నీళ్లు తుడుచుకుని అప్పటికి వెళ్లిపోయింది. ఇలా రెండు మూడు పర్యాయాలు అదే డాక్టర్‌ను వైద్యం పేరిట కలిసి పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత... ఒక రోజు భోజనానికి రావాలని ఇంటికి ఆహ్వానించింది. కుర్ర డాక్టర్‌ ఆమె ఇంటికి వెళ్లాడు! బుక్కైపోయాడు! ఇక అసలు కథ మొదలైంది. అది... బ్లాక్‌ మెయిలింగ్‌! ఇది సినిమాలో ఓ సన్నివేశం కాదు.

గుంటూరు, విజయవాడలో వైద్యులపై ఒక ముఠా అందాల వల విసురుతోంది. వీరంతా ముందుగానే త మ ‘టార్గెట్‌’లను నిర్ణయించుకుంటారు.బాగా డబ్బున్న 40 ఏళ్లలోపు డాక్టర్లనే ఎంచుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో డాక్టర్‌ వద్దకు వెళతారు. వలలో పడిన వైద్యుడి ని విందుకు, వినోదానికి ఇంటికి పిలిచి ట్రాప్‌ చేస్తారు. డాక్టర్‌తో సన్నిహితంగా మెలుగుతూ... ఆ దృశ్యాలను కెమెరాల్లో చిత్రీకరిస్తారు. ఆ తర్వాత సదరు వైద్యుడికి ఆ బొమ్మలు చూపించి... లక్షలు గుంజుతారు.

11 మంది బాధితులు..

గుంటూరు, విజయవాడ, ఒంగోలు పట్టణాలకు ఈ ముఠా విస్తరించినట్లు తెలిసింది. గుంటూరులో నలుగురు డాక్టర్లు, విజయవాడలో ఐదుగురు, ఒంగోలులో ఇద్దరు అందాల వలలో పడినట్లు సమాచారం. మోసపోయి, లక్షలు పోగొట్టుకున్నప్పటికీ ఈ వైద్యులు తమ బాధను బయటికి చెప్పుకోలేకపోతున్నారు. సమాజం లో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న తాము ఇలా వలలో పడినట్లు తెలిస్తే... పరువు పోతుందనే భయంతో మౌనంగా ఉంటున్నారు.

గుంటూరులోని ఒక యువ డయాబెటాలజిస్ట్‌ నుంచి ఇప్పటికే భారీగా సొమ్ము వసూలు చేసిన ముఠా... మరింత వేధిస్తున్నట్లు తెలిసింది. సదరు డయాబెటాలజిస్ట్‌ తన బాధ ను స్నేహితుడైన మరో సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్‌తో పంచుకున్నారు. దీంతో ఆయన మరింతగా కూపీ లాగారు. వాట్సప్‌ గ్రూప్‌ల ద్వారా సమాచారం పంపి.. డాక్టర్ల పేర్లు వెల్లడించనవసరం లేదని.. ఎవరైనా డాక్టర్లు ఇలా బ్లాక్‌మెయిల్‌కు గురైతే వివరాలు చెప్పాలన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top