భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. భార్య ఆత్మహత్య

న్యూఢిల్లీ : ఢిల్లీకి చెందిన ఓ మహిళ.. కర్వా చౌత్ పర్వదినం పురస్కరించుకుని ఉపవాస దీక్ష చేసింది. సాయంత్రం చంద్రోదయం తర్వాత పూజ చేసి.. అమెరికాలో ఉంటున్న తన భర్తకు ఫోన్ చేసింది. ఈ సమయంలో భర్త ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్త బాగు కోసం ఉపవాస దీక్ష ఉన్న ఆమెకు.. భర్త ప్రవర్తన బాధ కలిగిచింది. దీంతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది భార్య. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కర్వా చౌత్‌ను ఎందుకు జరుపుకుంటారంటే..

ఉత్తరాది మహిళలు తమ భర్త నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. కర్వా చౌత్ అనే పండుగను ఘనంగా జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి తర్వాత నాలుగో రోజున కర్వా చౌత్ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఆ రోజున మహిళలు అందరూ సుందరంగా ముస్తాబు అవుతారు. చేతుల నిండా గోరింటాకు పెట్టుకుంటారు. సూర్యోదయం కంటే ముందు నుంచి ఉపవాస దీక్ష చేసి.. సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రుడికి పూజ చేసి జల్లెడ చాటున భర్తను చూస్తారు. ఇలా చేయడం వలన భర్త ఆయురారోగ్యాలతో ఉంటారని ఉత్తరాది మహిళల విశ్వాసం. ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top