గర్భిణీ బస్టాండులోని బాత్‌రూంకు వెళ్లి...ప్రసవించిన వేళ...

బాగల్‌కోట్ : ఏడు నెలల గర్భిణీ బాత్‌రూమ్‌లో ప్రసవించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో బాగల్‌కోట్ పట్టణంలో వెలుగుచూసింది. విజయపురా జిల్లా ముద్దిబిహాల్ తాలూకా గని గ్రామానికి చెందిన నిర్మల సిద్దేష్ అనే 27 ఏళ్ల మహిళ ఏడునెలల గర్భవతి. భర్త గోవాకు బదిలీ కావడంతో తల్లితో కలిసి నిర్మల తమ గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలోని బస్టాండులో ఈ ఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తూ లక్తల్ బస్టాండులోని బాత్ రూంకు వెళ్లిన నిర్మలకు అక్కడే హఠాత్తుగా నొప్పులు వచ్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బాత్ రూంలోనే మరో మహిళ సాయంతో ప్రసవమైంది. దీంతో తల్లీ బిడ్డలను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఏడునెలలకే బిడ్డ పుట్టడంతో తల్లీబిడ్డల ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకుంటున్నామని డాక్టర్లు చెప్పారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top