పోలిసుల ముందు హాజరుకాబోతున్నా వర్మ

హైదరాబాద్‌:

వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రాంగోపాల్‌వర్మ కాసేపట్లో హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. జీఎస్టీ వెబ్ సిరీస్‌తో దుమారం రేపిన వర్మ ఆ తరువాత వివాదాల్లో చిక్కుకున్నాడు. అశ్లీలతతో పాటు మహిళలను కించపర్చారంటూ వర్మపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ కేసులో వర్మ కాసేపట్లో పోలీసుల ఎదుట హాజరుకాబోతున్నాడు.

పోర్న్‌స్టార్ మాల్కోవా నటించిన జీఎస్టీ.. విడుదలకు ముందు పెను దుమారమే రేపింది. పాశ్చాత్య నగ్న సంస్కృతిని భారతీయ సంస్కృతిపై ఎలా రుద్దతారంటూ చెలరేగిన విమర్శలకు వర్మ తనదైన శైలిలో జవాబిచ్చాడు. దీంతో జీఎస్టీపై వివాదం రేగింది. జీఎస్టీని భారత్‌లో విడుదల చేయకుండా కేసులు నమోదు అయ్యాయి. వర్మ దిష్టిబొమ్మలను పలు చోట్ల దగ్ధం చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్మను మహిళా సంఘాల నేతలు దుమ్మెత్తిపోశారు. ఆ తరువాత వర్మపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి.

మొత్తంగా జీఎస్టీ వివాదంలో వర్మ కేసుల్లో ఇరుక్కున్నాడు. నిజానికి విచారణకు హాజరుకావాలంటూ వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గతంలోనే నోటీసులు పంపారు. అయితే విచారణకు హాజరుకాలేనంటూ మొదటిసారి వర్మ జవాబిచ్చాడు. మళ్లీ నోటీసులు ఇస్తే వస్తానంటూ సమాచారం ఇచ్చాడు. దీంతో వర్మకు పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు అందుకు వర్మ కాసేపట్లో సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరుకాబోతున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top