గోడను ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి

తిరుపతి: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని ఎమ్మార్‌పల్లి రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

స్థానికంగా ఉంటున్న ముగ్గురు యువకులు గురువారం రాత్రి నగర శివారులో పుట్టినరోజు వేడుకలు జరుపుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఎమ్మార్‌పల్లిలో రోడ్డు పక్కన ఉన్న ఓ గ్యాస్‌ గొడౌన్‌ గోడను బలంగా ఢీకొన్నారు. ఈ ఘటనలో శశికాంత్, జయకుమార్‌ ఆచారి అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో యువకుడు రూపేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని స్విమ్స్‌కు తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top