నవదంపతుల దాడికేసులో ట్విస్ట్‌

విజయనగరం : బైక్‌పై వెళ్తున్న నవదంపతులపై ముగ్గురు వ్యక్తులు సోమవారం రాత్రి దాడి చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ దాడి కేసులో మరో ట్విస్ట్‌ బయటకు వచ్చింది. వివరాలివి.. శ్రీకాకుళం జిల్లా అదే మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీశంకరావుకు, జిల్లాలోని వీరఘట్టం మండలం కడెకళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి గత నెల 28న వివాహామైంది. కానీ ఈ జంటపై సోమవారం విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం తోటపల్లి దగ్గర దాడి చోటుచేసుకుంది. ఈ దాడిలో భర్త అక్కడిక్కడే మృతిచెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.

అయితే ప్లాన్‌ ప్రకారమే భర్త శంకర్‌ రావుపై భార్య దాడి చేయించిన ఉదంతం బయటపడింది. ఇష్టంలేని పెళ్లి కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడిందని తెలుస్తోంది. సరస్వతి తన మిత్రుడు శివ, విశాఖ రౌడీషీటర్‌ గోపితో భర్తను హత్య చేయించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ పాలరాజుకు మనాపురం హైవేపై నిందితులు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు భార్యనే పథకం ప్రకారం భర్తను హత్యచేయించిందని నిర్థారించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top