ఇరాన్‌లో కుప్పకూలిన టర్కీ విమానం

ఇరాన్‌లో కుప్పకూలిన టర్కీ విమానం

ప్రమాదంలో 11 మంది మహిళలు దుర్మరణం

మృతుల్లో టర్కీకి చెందిన వ్యాపార దిగ్గజం హసేన్‌ బసరణ్‌ కుమార్తె మీనా బసరణ్‌

సాంకేతిక సమస్య కారణంగా జరిగిన ప్రమాదం

పెళ్లికి ముందు స్నేహితురాళ్లతో కలిసి ఓ సంపన్న యువతి చేసుకున్న వేడుకలు విషాదాంతమయ్యాయి. సంబరాల నుంచి తిరిగొస్తూ.. విమాన ప్రమాదంలో సదరు యువతి సహా మొత్తం 11 మంది మహిళలు దుర్మరణం పాలయ్యారు. ఇరాన్‌లోని జాగ్రోస్‌ పర్వతాల్లో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. టర్కీకి చెందిన వ్యాపార దిగ్గజం హసేన్‌ బసరణ్‌ కుమార్తె మీనా బసరణ్‌(28) వివాహం వచ్చే నెల 14న జరగాల్సి ఉంది. వివాహానికి ముందు వేడుకల్లో భాగంగా మీనా తన స్నేహితురాళ్లతో కలిసి కొన్ని రోజులు యూఏఈలో గడిపి.. ప్రైవేటు విమానం(బాంబార్డియెర్‌ ఛాలెంజర్‌ 604)లో టర్కీకి తిరుగుప్రయాణమయ్యారు. విమానంలో మీనాతోపాటు ఆమె స్నేహితులు ఏడుగురు, ముగ్గురు మహిళా సిబ్బంది ఉన్నారు. సాంకేతిక సమస్య కారణంగా పైలట్‌ కాస్త కిందకు దించడంతో.. జాగ్రోస్‌ పర్వతాల్లో విమానం కుప్పకూలింది. విమానంలోని మహిళలంతా మృత్యువాతపడ్డారు. మృతుల్లో మరో ముగ్గురు మహిళల వివాహాలు కూడా ఈ వేసవిలో జరగాల్సి ఉన్నట్లు సమాచారం.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top