ట్రంప్‌-కిమ్‌ల భేటికి డేట్‌ ఫిక్స్‌

వాషింగ్టన్‌: ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా- ఉత్తరకొరియా దేశాధినేతలు డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ భేటికి తేది ఖరారైంది. సింగపూర్‌లో జూన్‌ 12న ఉదయం 9 గంటలకు ఈ సమావేశం జరగనుందని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి శారా సాండర్స్‌ వెల్లడించారు.

‘ఈ నెల 12న కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో సమావేశం నేపథ్యంలో అదనపు భద్రతా దళాలు సింగపూర్‌ వెళ్లనున్నాయి. జూన్‌11 రాత్రి 9 నుంచి సమావేశ ప్రాంతాన్ని మా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంటారు. ఈ సమావేశంలో ఉత్తర కొరియా ప్రతినిధి బృందంతో అమెరికా రాయబారి దౌత్య చర్చలు కొనసాగిస్తారు. ట్రంప్‌-కిమ్‌ల చర్చలు సానుకూలంగా సాగనున్నాయ’ని శాండర్స్‌ పేర్కొన్నారు.

కాగా, గత వారం ట్రంప్‌ ఉత్తర కొరియా రాయబారి కిమ్‌ యోంగ్‌ చోల్‌తో వైట్‌హౌస్‌లోని ఓవల్‌ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్‌ ఉన్‌ పంపించిన లేఖను అధికారులు ట్రంప్‌కు అందజేశారు. అధికారులతో చర్చించిన తర్వాత జూన్‌ 12 కిమ్‌ తో సమావేశం కానున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు. ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహితంగా మార్చడం ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top