నేరెళ్ల ఘటనపై హక్కుల కమిషన్ సీరియస్: డిజిపికి నోటీసు

హైదరాబాద్‌: నేరెళ్ల సంఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర మానవ హక్కుల సంఘం తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మను ఆదేశించింది. ఎస్సీ, ఓబీసీలకు చెందిన 8 మందిని నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణలపై పోలీసులు సరిగ్గా స్పందించకపోవడాన్ని కమిషన్ తప్పుబట్టింది.

ఇసుక కాంట్రాక్టర్ల లారీలు ప్రమాదకరమైన వేగంతో నడుస్తున్నాయని, దాంతో మరణాలు సంభవించాయని గ్రామస్థులు పలు ఫిర్యాదులు చేసినప్పటికీ స్థానిక పోలీసులు స్పందించలేదని ఆరోపణలు వచ్చిన విషయాన్ని కమిషన్ గుర్తు చేసింది.

స్థాయికి ఇసుకను నింపుకుని అతి వేగంతో లారీలు నడుస్తున్నాయని, గ్రామాల ప్రజల భద్రతనూ రక్షణనూ పట్టించుకోవడం లేదని, జులై 2వ తేదీన ఓ ఇసుక లారీ ఎస్టీలకు చెందిన ఓ వ్యక్తిపై నుంచి దూసుకుపోయిందని, దాంతో రెండు లారీలకు ఆగ్రహం నిలువరించుకోలేక ప్రజలు నిప్పు పెట్టారని, దాంతో పోలీసులు 8 మందిని పట్టుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని కమిషన్ తన నోటీసులో వివరించింది. దానిపై వివరణ ఇవ్వాలని డిజిపిని ఆదేశించింది.

తమను చిత్రహింసలకు గురిచేసిన ఎస్పీ విశ్వజిత్‌ కంపాటి సహా 17 మంది పోలీసులను సస్పెండ్‌ చేయాలని నేరెళ్ల బాధితులు డిమాండ్‌ చేశారు. వేములవాడలో చికిత్స పొందుతున్న బాధితులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పోలీసులు పెట్టిన చిత్రహింసలతో తాము ఇప్పటికీ నడవలేకపోతున్నామని చెప్పారు.

తమపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, పునరావాసం కల్పించాలని బాధితులు కోరారు. మరోవైపు నేరెళ్ల ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన ప్రతి పోలీసులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ అనురాగ్‌ శర్మకు వినతిపత్రం ఇచ్చామని అఖిలపక్ష నేతలు తెలిపారు.

నేరెళ్ల ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేసినట్లు తెలంగాణ పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క తెలిపారు. బాధితులకు న్యాయం చేసేందుకు గవర్నర్‌, రాష్ట్రపతి, ఉన్నత న్యాయస్థా నం వరకు వెళ్తామని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెం ట్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పోలీసు ఉన్నతాధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ ద్రం డిమాండ్ చేశారు

సిరిసిల్ల జిల్లా నేరేళ్లలో దళితులు, బడుగు బలహీనవర్గాలపై జరిగిన దాడులపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హన్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల ఎస్పీని స స్పెండ్‌ చేయాలనిఆయన డిమాండ్‌ చేశారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top