శ్రీలలితా ఎంటర్‌ ప్రైజెస్‌ రైస్‌ మిల్లులోని గోదాములో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం వాల్‌తిమ్మాపురం గ్రామంలోని శ్రీలలితా ఎంటర్‌ ప్రైజెస్‌ రైస్‌ మిల్లులోని గోనె సంచుల గోదాములో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గోదాములోని గోనెసంచులన్నీ పూర్తిగా కాలిపోయాయి. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని యాజమాన్యం, కార్మికులు తెలిపారు. అగ్నిమాపక అధికారి నాగభూషణం పర్యవేక్షణలో 8 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంటలు భారీ ఎత్తున చెలరేగడంతో గోదాం పైకప్పు రేకులన్నీ కాలి బూడిదయ్యాయి. సిబ్బంది అప్రమత్తమై గోదాములోని మిగతా సామాగ్రిని బయటికి తరలించడంతో కొంతమేర నష్టం తప్పింది. గురువారం తెల్లవారుజామున ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్ప సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను సమీక్షించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని యాజమాన్యం పేర్కొంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top