పరీక్షా హాల్లోకి బూట్లు నో-ఎంట్రీ

పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ బీహార్ అధికారుల్లో దడ పెరుగుతోంది. ఇటీవల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరక్కుండా నిలువరించేందుకు కసరత్తు ప్రారంభమైంది. పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు చెప్పులు వేసుకుని రావాలనీ.. బూట్లు, సాక్సులు ధరించరాదని బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (బీఎస్ఈబీ) ఆదేశించింది. బూట్లు, సాక్సుల్లో చీటీలు, ఇతర వస్తువులను దాచుకునే అవకాశం ఉందని భావించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.

‘‘ఫిబ్రవరి 21 నుంచి జరిగే పదో తరగతి పరీక్షల కోసం హాజరయ్యే విద్యార్థులు బూట్లు, సాక్సులు ధరించకూడదు. ఈ ఆదేశాల్లో కొత్తేంలేదు.. రాష్ట్రంలో జరిగే ఇతర పరీక్షలకు ఇదే పద్ధతి కొనసాగుతోంది. పదో తరగతి పరీక్షలకు కూడా దీన్ని అమలు చేయాలని నిర్ణయించాం...’’ అని బీఎస్ఈబీ చైర్మన్ ఆనంద్ కిషోర్ పేర్కొన్నారు. బీహార్‌లో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల కోసం దాదాపు 17.70 లక్షల మంది హాజరవుతున్నారు. 1,426 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా ఇటీవల అక్కడ జరిగిన ఇంటర్ పరీక్షల్లో దాదాపు వెయ్యి మందికి పైగా మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరికిపోవడం గమనార్హం.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top