కేసీఆర్ మీద యనమల ఈగ కూడా వాలనివ్వడు: రేవంత్ రెడ్డి

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ లో ఎపి మంత్రులకు పనేంటి...?అని ప్రశ్నించిన రేవంత్, యనమలకు కేసీఆర్ 2వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చాడని..ఇక కేసీఆర్ మీద యనమల ఇగ వాల నిస్తాడా అని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. మమ్ములను జైల్లో పెడితే కేసీఆర్ కి ఎపి నేతలు దండం పెడతారా...? అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన రేవంత్, ఇవాళ మీడియాతో చిట్ చాట్ చేశారు.

కేసీఆర్ ఏపీకి వెళ్తే ఎపి నేతలు అంతగా మర్యాద చెయ్యాల్సిన అవసరం ఏంటి..? అన్నారు. పరిటాల పెండ్లిలో కేసీఆర్ వస్తే ఆయనకు వంగి వంగి దండం పెడతారు...చంద్రబాబు వస్తే కనీసం పట్టించుకునే వాళ్ళు లేరని విమర్శించారు. అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెడుతున్నారు ఎపి టీడీపీ నేతలంటూ రేవంత్ ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్ లో పరిటాల సునీత కొడుకు, పయ్యావుల అల్లుని భాగస్వామ్యంతో నడుస్తున్న బార్ కు బీర్లు తయారీ చేసే కంపనీ లైసెన్స్ ఎట్లా వచ్చిందని రేవంత్ రెడ్డి ఏపీ టీడీపీ నేతలు-టీఆర్ఎస్ టార్గెట్ గా సంచలన విషయాలు బయటపెట్టే ప్రయత్నం చేశారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top