ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్

ఢిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రకటించారు. సోమవారం బిజెపి పార్లమెంటరీ భేటీలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించారు. అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రామ్‌నాథ్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా 12 ఏళ్లు అనుభవం ఉంది. దళిత నేత. బిజెపి వ్యూహాత్మకంగా దళిత నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన 23వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

రాజకీయాల్లోకి రాకముందు ఆయన సుప్రీం కోర్టు లాయర్‌గా పని చేశారు. నాలుగేళ్ల పాటు బిజెపి దళిత మోర్చా అధ్యక్షుడిగా పని చేశారు. వయస్సు 71. రామ్‌నాథ్ గోవింద్ 1945 అక్టోబర్ 1వ తేదీన యూపీలోని కాన్పూర్ దెహత్ జిల్లా డేరాపూర్‌లో జన్మించారు. ఆయన యూపీ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. ఆలిండియా పోలీస్ సమాజ్ అధ్యక్షుడిగా పని చేశారు.

1994-2000, 2000-2006 మధ్య రెండుసార్లు రాజ్యసభకు వెళ్లారు. 1998 నుంచి 2002 వరకు బిజెపి దళిత మోర్చా అధ్యక్షుడిగా పని చేశారు. బిజెపి అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top