పోలవరం ప్రాజెక్ట్‌పై వెనుకడుగు వేస్తే... వచ్చే ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు

పోలవరం: పోలవరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తే... వచ్చే ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేనాని పవన్‌‌కల్యాణ్ హెచ్చరించారు. 2018నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి కాదని, కేంద్రంతో ధైర్యంగా మాట్లాడి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని కోరారు. పోలవరంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పవన్‌కల్యాణ్‌ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌పై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వచ్చానని, పోలవరం ప్రాజెక్ట్‌ ఏ ఒక్క ప్రభుత్వానిదో...పార్టీదో కాదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్‌ వల్ల లాభమెంతో...నష్టమెంతో పరిశీలించాలని, పునరావాస కార్యక్రమాలు సక్రమంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.

పెద్ద ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టినప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించాలని ఆయన సూచించారు. పెద్ద ప్రాజెక్ట్‌ల నిర్మాణాల్లో అవినీతి ఆరోపణలు సహజమని అభిప్రాయపడ్డారు. పోలవరం చాలెంజింగ్‌ ప్రాజెక్ట్ అని, ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయని, పోలవరం ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్‌కల్యాణ్‌ కోరారు. పోలవరం కాంట్రాక్ట్‌ సంస్థకు ఉన్న అర్హతలు ఏంటో చెప్పాలని ప్రభుత్వాన్ని పవన్‌ ప్రశ్నించారు. కేంద్రానికి ప్రాజెక్ట్‌ ఖర్చు లెక్కలు చూపిస్తే స్పష్టత వస్తుందని, పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఆలస్యం జరుగుతోందని, ఉన్న ప్రాజెక్ట్‌ను ఆపేస్తే చాలా నష్టం వస్తుందని పవన్‌కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top