ఆంధ్ర ప్రదేశ్ న్యాయం ఫై పవన్ కళ్యాణ్ తీసుకున్న సీరియ‌స్ స్టెప్

మొత్తానికి *ఏపీకి జ‌ర‌గాల్సిన‌ న్యాయం* గురించి ఇపుడు ప్ర‌తి గొంతు ప్ర‌శ్నిస్తోంది. పార్ల‌మెంటులో టీడీపీ ప్రారంభించిన నిర‌స‌న రాష్ట్రమంతా పాకింది. ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌ను చైత‌న్యం చేసింది. తెలుగు వారి ఓపిక‌ను ప‌రీక్షించ‌డానికా అన్న‌ట్లు బ‌డ్జెట్లో ప్ర‌త్యేక సాయం కింద ఒక్క రూపాయి కూడా కేంద్రం కేటాయించ‌క‌పోవ‌డంతో ఏపీ ప్ర‌జ‌ల్లో ఓపిక న‌శించి వారు పోరుకు రెడీ అయ్యారు. దీనికి టీడీపీ వ‌హించిన నాయ‌క‌త్వం హిట్ట‌యింది. ఆ వెంట‌నే వామ ప‌క్షాలు అందుకుని బంద్‌కు పిలుపునిచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కూడా తెలుగుదేశం ఎంపీల‌తో పాటు నిర‌స‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికింది. జ‌గ‌న్ బంద్‌కు కూడా మ‌ద్ద‌తు ఇచ్చారు. అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా మోడీ చిన్న‌చూపు ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఏపికి జ‌ర‌గాల్సిన న్యాయం గురించి ప‌వ‌న్ కొంచెం సీరియ‌స్ ప్ర‌య‌త్నాలే మొద‌లుపెట్టారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తీసుకున్న సీరియ‌స్ స్టెప్ జేఏసీ నిర్మాణం. దానికోసం న్యాయ‌కోవిదుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌, లోక్ స‌త్తా అధినేత జేపీ స‌హ‌కారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోరారు. వారు దానికి స‌హ‌క‌రించారు. ఆ ఇద్ద‌రితో వేరువేరుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌త్యేకంగా బేటీ అయ్యి చ‌ర్చించారు. అనంత‌రం వారిద్ద‌రూ క‌లిసి సీపీ నేత రామ‌కృష్ణతో క‌లిసి ఈరోజు బేగంపేట‌లోని లోక్‌స‌త్తా కార్యాల‌యంలో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఒక నిర్ణ‌యం తీసుకున్నారు.

మిగ‌తా వారంతా రాజ‌కీయం చేస్తుంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చెప్పిన వారు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగోలేద‌ని, స‌మ‌ష్టి పోరాటం వ‌ల్ల ఏపీని ముందుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేయాల‌ని పిలుపునిచ్చారు. ఈనెల 18న ఎంపీలు, ప్ర‌జా సంఘాలు, విద్యార్థులతో జేఏసీ ప్ర‌తిపాదిత నేత‌లు స‌మావేశం కానున్నారు. ఈ సంద‌ర్భంగా జేఏసీ కోసం మ‌రికొంద‌రిని ఎంపిక చేసుకుని ఒక ప్ర‌ముఖ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశాలున్నాయి. ఇందులో కొన్ని మీటింగుల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా హాజ‌రుకానున్నారు. తెలంగాణ ఉద్య‌మం స‌క్సెస్ కావ‌డం వెనుక విద్యార్థుల పాత్ర చాలా కీల‌కంగా ఉప‌యోగ‌ప‌డిన నేప‌థ్యంలో ఏపీలో కూడా విద్యార్థుల‌ను ఇందులో క‌లుపుకుపోవాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top