‘ఆమె ఓ రాజకీయ వ్యభిచారి’..సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్/ప్యాంగ్‌యాంగ్: ఉత్తరకొరియా, అమెరికా మధ్య ఉద్రిక్తకర పరిస్థితిలో ఏమాత్రం తేడా లేదు. రోజురోజుకూ ఈ పరిస్థితి మరింత దిగజారుతోంది. ఆంక్షలు కూడా లెక్కచేయని ఉత్తరకొరియాను ఒంటిరి చేయాలని ఐక్యరాజ్యసమితిలో అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పలు కఠినమైన ఆంక్షలను విధించాలని భద్రతామండలిలోని సభ్యదేశాలను కోరుతోంది. ఈ అంశంపై భద్రతామండలి సోమవారం సమావేశం కానుంది. ఐరాస భద్రతామండలిలో కీలకంగా వ్యవహరిస్తూ ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు, రెచ్చగొట్టే చర్యలపట్ల హెచ్చరికలు జారీ చేస్తున్న భారత సంతత మహిళ, ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హెలీపై ఉత్తరకొరియా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిక్కీ హేలీని ఓ ‘రాజకీయ వ్యభిచారి’గా ఉత్తరకొరియా వర్ణించింది. నిక్కీ హేలీ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నామని ఉత్తరకొరియాకు చెందిన కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తీవ్రవ్యాఖ్యలు చేసింది. ఉత్తరకొరియాను అవమానించేలా ఆమె మాట్లాడుతున్నారని పత్రిక పేర్కొంది. నిక్కీ హేలీని అమెరికా నియంత్రించకపోతే పరిణామాలకు బాధ్యత మాది కాదంటూ కేఎన్‌సీఏ వ్యాఖ్యానించింది. ఇదిలావుండగా ఉత్తరకొరియా రెచ్చగొట్టే విధానాలను నిక్కీ హేలీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరకొరియా యుద్ధాన్ని అడుక్కుంటోందని గతంలో ఆమె ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top