ఆధార్‌ లింకింగ్‌పై భారీ ఊరట

న్యూఢిల్లీ: ప్రత్యేక ఐడెంటిఫికేషన్ నంబర్ ఆధార్‌ అనుసంధానంపై సామాన్యులకు భారీ ఊరట లభించింది. ఈ మార్చి 31తో ముగియనున్న వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ సేవలు తదితరాలకు ఆధార్‌ అనుసంధానం గడువును దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు వాయిదా వేసింది. చీఫ్ జస్టిస్ దీపాక్ మిశ్రా నేతృత‍్వంలోని జస్టిస్ ఎకె సిక్రీ, ఎఎం ఖాన్విల్కర్, డివై చంద్రకుడ్, అశోక్ భూషణ్‌తో కూడిన ఐదుగురు న్యాయనిర్ణేతల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై తుది విచారణ పూర్తయ్యేంతవరకు ఎలాంటి డెడ్‌లైన్‌ లేదని తేల్చి చెప్పింది. అసలు బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ లాంటి సేవలకు ఆధార్‌ లింకింగ్‌ తప్పనిసరి కాదని చెప్పింది.

ఆధార్‌ మాండేటరీ, ఆధార్‌ గోప్యతపై పలు పిటీషన్లపై విచారించిన సుప్రీం మంగళవారం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు బ్యాంకు ఖాతా, మొబైల్‌, తత్కాల్‌ పాస్‌పోర్ట్‌ లాంటి సేవలకు ప్రత్యేక ఐడెంటిఫికేషన్ నంబర్ ఆధార్‌ తప‍్పనిసరి కాదని స్పష్టం చేసింది. ప్రభుత‍్వ సాంఘిక పథకాలకు మాత్రమే ఆధార్ అవసరమవుతుందని పేర్కొంది. కాగా ప్రభుత్వ సేవలు పొందడానికి ఆధార్ కచ్చితమా లేదా అనే అంశంపై పలు స్వచ్ఛంద సంస్థలు పిటిషన్లపై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్‌ అనుసంధానం గడువును పలుమార్లు పొడిగించిన సంగతి తెలిసిందే.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top