నా చెల్లిని చంపేశారు.. వారిని వదలొద్దు

హైదరాబాద్ : తన చెల్లిని కుట్రపూరితంగానే కిడ్నాప్ చేసి హత్య చేశారని చాందినీ జైన్ సోదరి నివేదిత జైన్ ఆరోపించారు. నగరంలో శనివారం అదృశ్యమైన వ్యాపారవేత్త కిషోర్ జైన్ కుమార్తె, ఇంటర్ విద్యార్థిని చాందిని మిస్టరీ విషాదాంతంగా ముగిసింది. కుమార్తె మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో ముగినిపోయింది. అయితే తమకు ఎవరితోనూ గొడవలు లేకున్నా తన చెల్లిని కావాలనే హత్య చేశారని చాందినీ సోదరి ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 9న కాలేజీ నుంచి ఇంటికొచ్చిన చాందిని సాయంత్రం ఐదున్నర గంటలకు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లింది.

ఓ గంట తర్వాత చెల్లికి కాల్ చేస్తే ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినట్లు వచ్చింది. అనుమానం రావడంతో చాందిని కోసం బంధువులు, చెల్లి స్నేహితుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోయిందన్నారు. చాందిని అదృశ్యంమైందని ఆదివారం మియపూర్ పోలీసులకు పిర్యాదు చేశాం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చాందినీ హత్యకు గురైందని మాకు సమాచారం అందించారు. మా చెల్లి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరారు. పీజేఆర్‌ కాలనీ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్న సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్యా, పోలీసు సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చాందినీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top