సాగేందుకు వీలుగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ సర్క్యూట్‌

లండన్‌: ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్‌లను మనం మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో చూస్తుంటాం. ఇకపై మనం ధరించే దుస్తులపైనా అవి కనిపించనున్నాయి. ఉతికేందుకు, సాగేందుకు వీలుగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ సర్క్యూట్‌లను శాస్త్రవేత్తలు విజయవంతంగా దుస్తులపై ముద్రించారు. డిజిటల్‌ టెక్స్‌టైల్‌ రంగంలో ఇవి వినూత్న మార్పులు తీసుకువస్తాయని చెబుతున్నారు.

ఉతికేందుకు, సాగేందుకు వీలుగా ఉండే ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్‌లను దుస్తులపై ముద్రించడం ఎలక్ట్రానిక్‌ దుస్తుల తయారీ రంగానికి ఎంతో ఉపయుక్తమని పరిశోధకులు చెబుతున్నారు. పైగా ఈ సర్క్యూట్‌లను చౌకైన, సురక్షితమైన, పర్యావరణ హిత ఇంక్‌లతో సంప్రదాయ ఇంక్‌జెట్‌ ప్రింటింగ్‌ సాంకేతికత సాయంతో ముద్రించినట్లు లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి పరిశోధకులు తెలిపారు. గ్రాఫిన్‌ను ఉపయోగించి దుస్తులపై నేరుగా ఇంటిగ్రేటెడ్‌ ఎలక్ట్రానిక్స్‌ సర్క్యూట్‌లను ముద్రించవచ్చని.. ఇవి దాదాపు 20 ఉతుకుల వరకూ వస్తాయని చెప్పారు.

ధరించడానికి వీలుగా ఉంటే ఎలక్ట్రానిక్‌ పరికరాలను ప్రస్తుతం ఎక్కువగా ప్లాస్టిక్‌, రబ్బర్లపై అమర్చుతున్నారని.. అవి ఉతకడానికి పనికిరావని పరిశోధకుల్లో ఒకరైన ఫెలిస్‌ టోర్రిస్‌ తెలిపారు. తాము ఉపయోగించే ఇంక్‌లు తక్కువ ధరకే లభిస్తాయని, సురక్షితమైనవని ఆయన పేర్కొన్నారు. పైగా తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుంటాయని చెబుతున్నారు. ‘నానో టెక్నాలజీ రంగానికి కృతజ్ఞతలు.. భవిష్యత్‌లో మా దుస్తులు డిస్‌ప్లేలుగా, సెన్సార్లుగా, ఇంటరాక్టివ్‌ డివైజ్‌లుగా మారుతాయి’ అని ఆయన వెల్లడించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top