నంద్యాల ఉపఎన్నిక: బీజేపీ అధికారిక ప్రకటన

విజయవాడ: నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే మద్దతు తెలపాలని ఏపీ బీజేపీ నిర్ణయించింది. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన పదాధికారుల సమావేశంలో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ బీజేపీ అధికారికంగా ప్రకటించింది. నంద్యాల ఉప ఎన్నికతోపాటు త్వరలో జరుగనున్న కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీడీపీతో కలిసే పనిచేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.

టీడీపీ- బీజేపీలు రాష్ట్రంలోనేకాక కేంద్ర ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ మద్దతు విషయంలో మాత్రం బీజేపీ తన నిర్ణయాన్ని ఆలస్యంగా వెల్లడించడం గమనార్హం. ఆది లేదా సోమవారం నుంచి నంద్యాలలో బీజేపీ శ్రేణులు కూడా టీడీపీతో కలిసి ప్రచారంలో పాల్గొంటారని కాషాయపార్టీ నేతలు తెలిపారు. నంద్యాలలో ఆగస్టు 23న పోలింగ్‌ జరగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.. ఆగస్టు చివరి వారంలో మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. సంబంధింత ఏర్పాట్లపైనా పార్టీ నాయకులు చర్చించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top