బుల్లెట్‌ రైలు పనులకు శ్రీకారం

అహ్మదాబాద్‌: ముంబయి- అహ్మదాబాద్‌ మార్గంలో బుల్లెట్‌ రైలు పనులకు నేడు ప్రధాని మోదీ, జపాన్‌ ప్రధాని షింజోఅబేలు శంకుస్థాపన చేశారు. వీరిద్దరు రిమోట్‌ ద్వారా వీరు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా షింజోఅబే మాట్లాడుతూ శక్తివంతమైన జ‌పాన్‌‌ అనేది భారత్‌ సంబంధాలపై ఆధారపడి ఉంటుందని.. శక్తివంతమైన భారత్‌ అనేది జ‌పాన్‌‌తో సంబంధాలపై ఆధారపడి ఉంటుందన్నారు.

ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య 508 కిలోమీటర్ల మేరకు ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. గతేడాది నవంబర్‌లో మోదీ జపాన్‌ పర్యటనలో భాగంగా బుల్లెట్‌ రైలు పథకానికి శ్రీకారం చుట్టారు. 2018లో నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top