మియాపూర్‌లో ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

హైదరాబాద్‌: నగరంలో ఓ యువతి మిస్సింగ్‌ మిస్టరీ విషాదంతంగా ముగిసింది. ఇంటర్మీడియట్‌ చదువుతున్న చాందిని జైన్‌ అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అమీన్‌పూర్‌ సమీపంలోని కొండల్లో విద్యార్థిని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

మియపూర్ లోని దీప్తిశ్రీనగర్.. సత్యనారాయణ ఎనక్లేవ్ లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త కిషోర్ జైన్ కుమార్తె చాందిని. ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంది. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చాందిని ఎంతకీ తిరిగి రాలేదు. సెల్‌ ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్ రావటంతో కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ప్రయోజనం లేకపోవటంతో కిడ్నాప్‌ చేశారేమోనని భావించిన ఆమె సోదరి నివేదితా జైన్‌ ఆదివారం మియపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేస్ నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు.

చివరకు పీజేఆర్‌ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో ఆమె శవమై తేలింది. ఘటనాస్థలిని పరిశీలించిన సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కుమార్తె మరణంతో ఆ కుటుంబం శోక సంద్రంలో నిండిపోయింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top