ఏపీ మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం

సూర్యాపేట : ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఆదినారాయణ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంత్రి ఆది నారాయణరెడ్డికి చెందిన ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్‌కు స్వల్పంగా గాయపడ్డారు.

సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి అమరావతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండటంతో రహదారి కనపడక కాన్వాయ్‌లోని ఒక వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. గన్‌మెన్లు, డ్రైవర్‌ను మంత్రి తన వాహనంలో కోదాడ ఆస్పత్రికి తీసుకెళ్ళి చేర్చారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top