మేడారం హుండీ లో ఖజానా

ఇటీవల జరిగిన మేడారం జాతర సందర్భంగా హుండీల ద్వారా రూ.10,17,50,363 ఆదాయం సమకూరింది. హన్మకొండలోని తితిదే కల్యాణ మండపంలో 479 హుండీలు తెరిచి వారంపాటు లెక్కించారు. సోమవారం నోట్లు, చిల్లర నాణేలు, విదేశీ కరెన్సీ, బంగారు, వెండి ఆభరణాల లెక్క పూర్తి చేశారు. నగదుతోపాటు 824 గ్రాముల బంగారం, 47.470 కిలోల వెండి ఆభరణాలు, 32 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు హుండీల నుంచి వెలువడ్డాయి. విదేశీ కరెన్సీ నోట్లను ఆర్‌బీఐకి పంపుతామని మేడారం ఈవో రమేష్‌బాబు పేర్కొన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top