మహారాష్ట్రలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ

మహారాష్ట్రలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లా పల్లేడ్‌ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతి చెందిన మావోయిస్టుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. జంగనూరు పీఎస్‌ పరిధిలో ఈరోజు ఉదయం 7 ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

సంఘనా స్థలంలో పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలను, మావోయిస్టుల కిట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నట్టు సమాచారం. వారి కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. కాల్పుల నేపథ్యంలో పోలీసులు కూంబింగ్‌ను మరింత ముమ్మరం చేశారు. మావోయిస్టుల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top