నీతో బోర్‌కొడుతోంది. నేను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నాను

అబుదాబి: తన భార్య ప్రవర్తనలో వచ్చిన మార్పుని చూసిన 29 ఏళ్ల వయసున్న ఓ భర్త ఆవేదనకు గురయ్యాడు. నిజం తెలిసి షాక్‌కు గురయ్యాడు. చేసేదేమీ లేక కోర్టును ఆశ్రయించాడు. యూఏఈలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 25 ఏళ్ల వయసున్న ఓ యువతి తన పిల్లల సంరక్షణ గాలికి వదిలేసింది. అవసరం లేకపోయినా జాబ్ చేయడం, భర్తను ఏమాత్రం పట్టించుకోకపోవడం, ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్తున్నానని ఇల్లు వదిలిపెట్టడం భర్తకు అనుమానం కలిగించాయి. అసలు తన భార్య ఏం చేస్తుందా.. అని ఓ రోజు గమనించాడు. ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. అసలు విషయం తెలిసి నివ్వెరపోయాడు. ఇంటికి వచ్చిన భార్యని ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించాడు. భర్త ప్రశ్నలకు భార్య నిర్లక్యంగా సమాధానం చెప్పింది. ‘నీతో బోర్‌కొడుతోంది. నేను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నాను’ అని చెప్పింది. అంతేకాకుండా రెండో పెళ్లి చేసుకుందామనుకుంటున్నానని మొహమాటంలేకుండా చెప్పింది. ఎంత చెప్పినా భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడం పక్కనపెడితే.. భర్త సరిగా చూసుకోవడం లేదని, బయటకు తీసుకెళ్లడం లేదని ఆరోపించింది. పిల్లలు ఉన్నారని భావించిన భర్త తన భార్యను విడిచిపెట్టలేక ఫ్యామిలీ గైడెన్స్ డిపార్ట్‌మెంట్‌ను ఆశ్రయించాడు. అక్కడ కూడా ప్రయోజనం లేకపోవడంతో కేసుని కోర్టుకు బదిలీ చేశారు. దీంతో భార్య నుంచి విడాకులు కావాలని కోరిన భర్త నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. కోర్టు విడాకులు జారీ చేసింది. దీంతో భార్యాభర్తలు విడిపోయారు. తన భార్య, పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కలలు కన్నానని, కానీ భార్య తనపై ప్రేమలేకపోవడం, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడాన్ని నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top