అర్ధరాత్రి కేక్ లు కట్ చేస్తూ ఎంజాయ్ చేసిన ప్రేమజంటలు

హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులో ప్రేమికుల సందడి కనిపించింది. యువతీయువకులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పకుంటూ సరదాగా గడిపారు. భజరంగ్‌దల్, వీహెచ్‌పీ హెచ్చరికల నడుమ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకపక్క శివరాత్రి, మరో పక్క వాలెంటైన్స్‌ డే ఒకేరోజు రావడంతో యువతకు సరికొత్త అనుభూతి కలిగింది. చూపులు కలుపుకుని మనసులు ముడివేసుకునేందుకు నెక్లెస్‌రోడ్డు వేదికైంది. అలవాట్లు, అభిప్రాయాలు, జీవనశైలిని పంచుకునేందుకు అర్ధరాత్రి అయినా సరే ఆలోచించకుండా అమ్మాయిలు, అబ్బాయిలు రోడ్ల మీదకు వచ్చారు.

కొందరు ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ప్రేమను ఆశ్వాదిస్తే, మరికొందరు బైక్‌లపై తిరుగుతూ కేరింతలు కొట్టారు. సరదాగా సెల్ఫీలతో ఎంజాయ్ చేశారు. కేక్‌లు కట్ చేసి ఒకరి మొహాలకు ఒకరు పూసుకున్నారు. ప్రేమికులు కనిపిస్తే పెళ్లి చేస్తామని భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ హెచ్చరించినప్పటికీ లవ్‌బర్డ్స్ మాత్రం ఎక్కడా భయపడిన దాఖలాలు కనిపించలేదు. మరోపక్క ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top