ఫాదర్‌ పాడు బుద్ధి.. చర్చిలో అపచారం

తిరువనంతపురం : కేరళలో ఓ చర్చి ఫాదర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పదేళ్ల బాలికపై చర్చిలో లైంగికదాడి చేసే యత్నం చేశాడు. దీంతో అతడిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరాజ్‌ అనే 65 ఏళ్ల వ్యక్తి తిరువనంతపురంలోని ఓ చర్చిలో ఫాదర్‌గా పనిచేస్తున్నారు. ఆ చర్చికి ఓ పదేళ్ల బాలిక బైబిల్‌ స్టడీ సమయంలో వస్తుంటుంది.

ఆ బాలికను రోజు ఆమె తండ్రి వచ్చి తీసుకెళుతుంటాడు. అందులో భాగంగానే ఆదివారం బైబిల్‌ స్టడీ సెషన్‌ పూర్తయిన తర్వాత ఆ బాలికను తీసుకెళ్లేందుకు ఆ తండ్రి వచ్చిన సమయంలో ఫాదర్‌ దేవరాజ్‌ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటం చూశాడు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పడంతో అతడిని అరెస్టు చేశారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top