శ్రీరెడ్డి చీప్ వీడియో బయటికి..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వాళ్లు వెనక్కి తగ్గారు. మహిళా సంఘాలు అండగా నిలిచాయి. జనాల్లోనూ కొంత సానుభూతి వచ్చింది. మొత్తానికి శ్రీరెడ్డి మీద జనాలకు అభిప్రాయం మారుతోందిలే అనుకున్నారంతా. అంతలోనే ఆమె నోటి దురుసు మరోసారి బయటపెట్టుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను రాజకీయ ప్రత్యర్థులు సైతం అనని మాటలు అంది. అన్ని వైపులా తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుంది. ఇప్పుడిక ఆమెను ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. కుట్రపూరితంగా పవన్ ను టార్గెట్ చేసినట్లు కనిపించడంతో ఆమెను అందరూ తిట్టిపోసేవాళ్లే. గతంలో పవన్ ను పలుమార్లు విమర్శించిన జీవిత సైతం ఆయనకు మద్దతుగా నిలిచింది. పవన్ ఏం తప్పు మాట్లాడాడని అంత మాట అన్నావంటూ శ్రీరెడ్డిని దులిపేసింది.

అంతే కాదు.. శ్రీరెడ్డి వెకిలి వేషాలకు సంబంధించి జీవిత ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. కార్లో కూర్చుని తన ‘అభిమానులతో’ వీడియో చాట్ చేస్తున్నప్పటి దృశ్యాలు అందులో ఉన్నాయి. అందులో శ్రీరెడ్డి వాడిన భాష.. చేసిన కామెంట్లు చూస్తే జుగుప్స కలగడం ఖాయం. పోర్న్ సినిమాల్లో నటించేవాళ్లు కూడా అబ్బాయిలతో అలా సంభాషించరేమో. అంతటి వల్గర్ లాంగ్వేజ్ వాడింది అందులో శ్రీరెడ్డి. తాను 24 గంటలూ సెక్సీ మూడ్లోనే ఉంటానని శ్రీరెడ్డి అందులో స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. ఇక ఒంట్లోని తన అంగాల్ని వర్ణించిన తీరు గురించి ఇక్కడ రాయడం కూడా కష్టమే. ఈ వీడియో చూశాక శ్రీరెడ్డి స్థాయి ఏంటో ఎవ్వరికైనా అర్థమైపోతుంది. ఇంత చీప్ గా వ్యవహరించిన శ్రీరెడ్డా పవన్ కళ్యాణ్ ను విమర్శించేది అంటూ ఆయన అభిమానులు శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top